Tuesday, 28 October 2014

కేసుకో రేటు

ాజీకి రూ. 50వేలు
ఫక్‌ కేసు కొట్టివేతకు రూ.30 వేలు
స్టషన్‌ బెయిల్‌కు రూ.20 వేలు
గొర్రెలు ఇస్తే కేస్‌ క్లోజ్‌

ఆ స్టేషన్‌లో అధికారి నుంచి సిబ్బంది వరకు అందరిదీ అదే దారి
‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా..!’ అనే సామెత  నగరంలోని ఓ పోలీస్‌స్టేషన్‌కు సరిగ్గా సరిపోతుంది. ఆ స్టేషన్‌లో  పైస్థాయి అధికారి నుంచి కిందిస్థాయి సిబ్బంది వరకూ అందరూ వసూల్‌ రాజాలే. కేసు తీవ్రతను బట్టి స్టేషన్‌ అధికారి నుంచి, కానిస్టేబుల్స్‌ వరకు ప్రతి ఒక్కరూ తమకు ఎంత కావాలో.. అంతా డిమాండ్‌ చేసి మరీ తీసుకుని, జేబులు నింపుకుంటున్నారు. కేసుల ‘సెటిల్‌మెంట్‌’లో వారు సిద్ధహస్తులు. డబ్బులుంటేనే ఇక్కడ పని జరుగుతుందని బాధితులు వాపోతున్నారు. పోలీస్‌ వ్యవస్థను ప్రజలకు మరింత చేరువచేస్తామని చెబుతున్న ఉన్నతాధికారులు ఇక్కడి అక్రమాలపై దృష్టిపెట్టాలి...షాపు యజమాని నుంచి రూ. 50 వేలు తీసుకున్నట్లు తెలిసింది. 
కేసు రాజీకి రూ. 30 వేలు
శ్రీనాథ్‌ అనే హోటల్‌ నిర్వాహకుడిపై పలువురు ఫాల్స్‌ కేసు పెట్టారు. విచారణ చేయకుండానే పోలీసులు అతనిని అరెస్ట్‌ చేయటానికి చూశారు. కొన్నిరోజుల తర్వాత ఫిర్యాదుదారులు తాము ఫాల్స్‌కేసు పెట్టామని, విత్‌డ్రా చేసుకుంటామన్నారు. అందుకు ఆ స్టేషన్‌ ఏఎస్‌ఐ రూ.30వేలు తీసుకున్నట్లు తెలిసింది. 
మరో కేసులో రూ. 20 వేలు
దీపావళి సందర్భంగా టపాసులు విక్రయించేందుకు ఈ స్టేషన్‌ పరిధిలోని ఓ వ్యక్తి మందుగుండు సామాగ్రి తెచ్చాడు. పర్మిషన్‌ లేదంటూ అతనిని ఈ స్టేషన్‌ పోలీసులు అరెస్ట్‌చేశారు. స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చేందుకు రూ.20వేలు వసూలు చేసినట్లు తెలిసింది. 

No comments:

Post a Comment