జిల్లాలోని ఆర్టీసీ డిపో మేనేజర్లతో ఈడీ నాగరాజు
పీకల్లోతు నష్టాలలో కూరుకుపోయిన పల్లె వెలుగు సర్వీసులను తక్షణం గాడిలో పెట్టకపోతే ఆర్టీసీ మనుగడకే ప్రమాదమని ఏపీఎస్‌ఆర్‌టీసీ విజయవాడ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జె.నాగరాజు హెచ్చరించారు. ఈ వాస్తవాన్ని అర్థం చేసుకునే విధంగా ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమాలు తీసుకోవాలని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని కల్పించాలని పిలుపునిచ్చారు. తీవ్ర నష్టాలతో నడుస్తున్న పల్లె వెలుగు బస్సులపై ఈడీ అత్యవసర సమీక్ష నిర్వహించారు. రీజనల్ మేనేజర్ (ఆర్‌ఎం) జి.సుధేష్ కుమార్ అధ్యక్షతన జిల్లాలోని డిపో మేనేజర్లందరూ ఈ సమీక్షలో పాల్గొన్నారు. ప్రయాణికుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి రోజూ 410 రూట్లలో 1315 బస్సులను నడుపుతోంది. జూలై త్రైమాసికం నాటికి చూస్తే రీజియన్ రూ.4.32 కోట్ల నష్టంతో నడుస్తోంది. సామాన్య ప్రజల కోసం జిల్లా వ్యాప్తంగా 145 రూట్లలో 321 పల్లె వెలుగు సర్వీసులను నడుపుతోంది. కొన్నేళ్ళుగా గణనీయంగా వీటి ఆదాయం తగ్గిపోతోంది. ఆదరణ కూడా అంతకంతకూ తగ్గిపోతోంది. ప్రతి రోజూ ఒక్కో పల్లెవెలుగు బస్సుకు సగటున 3415 రూపాయల నష్టం వాటిల్లుతోంది.
పల్లె వెలుగు రూట్లలో ప్రధానంగా ఆటోలు, ఇతర ప్రయివేటు వాహనాలు ఓవర్ లోడ్ చేసుకుని నడుపుతున్న విషయాన్ని డిపో మేనేజర్లు ప్రస్తావించారు. జిల్లా అంతటా ఇదే పరిస్థితి ఉందన్నారు. రూ. 10 లక్షల నష్టం వచ్చే పల్లెవెలుగు బస్సుల ఉదంతాన్ని కూడా వివరించారు. దీంతో వాటి వివరాలను ఈడీ అడిగారు. విజయవాడ - మచిలీపట్నం, విజయవాడ - గుడివాడ, విజయవాడ - అవనిగడ్డ, విజయవాడ - జగ్గయ్యపేట, విజయవాడ - తిరువూరు, విజయవాడ - నూజివీడు రూట్లలో ఎక్కువుగా నష్టాలు వస్తున్న విషయాన్ని డిపో మేనేజర్లు వివరించారు. పల్లె వెలుగులకు ఆదరణ తీసుకువచ్చేందుకు సంస్థాగతంగా కృషి చెయ్యాలని ఈడీ ఆదేశించారు. ప్రజలకు నిర్ణీత సమయంలో సర్వీసులు అందుబాటులో ఉంచాలని, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించాలన్నారు. ప్రజలు పల్లెవెలుగు బస్సులను ఆదరించకపోతే ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమేనని ఈడీ, ఆర్‌ఎంలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సిటీ, రూరల్ డివిజన్ డిప్యూటీ చీఫ్ ట్రాఫిక్ మేనేజర్లు (డీసీటీఎం) ఎం.నాగేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

No comments:
Post a Comment