Thursday, 2 October 2014

నేటి అలంకారాలు

దుర్గాదేవి, మహిషాసురమర్థిని దేవి
దుర్గ దేశ వాస రతా దుర్గ దేశ విలాసినీ
దుర్గ దేశార్చన రతా దుర్గ దేశ జన ప్రియా
దుర్గమ స్థాన సంస్ధానా దుర్గమధ్యాను సాధనా
దుర్గమా దుర్గమ ధ్యానా దుర్గమాత్మ స్వరూపిణి 

దుర్గమాగమ సంస్థానా, దుర్గమాగమ సంస్తుతా

దుర్గా అంటే చాలు దుర్గతులు అన్నీ పోతాయని నమ్మిక. దుర్గాదేవి మహాశక్తి స్వరూపిణి. అష్టమి తిధి రోజున రురు కుమారుడయిన దుర్గముడు అనే రాక్షసుడ్ని సంహరించారు. ప్రకృతి పంచ మహా స్వరూపాలలో దుర్గాదేవి మొదటిది. దుర్గాదేవి ఉగ్రంతో ఉంటుంది గను క, ఆమెను లలితా సహస్ర నామంతో కాని, ద కార దుర్గా స్తోత్రంతో కాని అర్చించాలని చెబుతారు. దుష్ట గ్రహాలు ఇబ్బంది పెడుతుం టే, ఏ నక్షత్ర ప్రభావంగా అయినా ఇబ్బందు లు కలుగుతుంటే, ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక దురదృష్టకర సంఘటనలు జరుగుతుంటే దుర్గా దేవిని స్తోత్రం చేయడం ద్వారా, ఆమెకు పూజ లు చేస్తే ఉపశమిస్తాయని నమ్మిక.
మాతర్మే మధు కైటభగ్ని మహిష ప్రాణాప హరోద్యమే
హేలా నిర్మిత ఽఽధూమ్ర లోచన వధే హే చండ ముండార్ధిని
నిశ్శేషీ కృత రక్త బీజ దనుజే నిత్యే నిశుంభాపహే
శుంభ ధ్వంసిని సంహారాశు దురితం దుర్గే నమస్తేంబికే
దుష్ట సంహారం కోసం వివిధ రూపాలు ధరించిన ఆమ్మవారు ముల్లోకాలకు భయంకరమైన రాక్షసుడు మహిషాసురుడిని హతమార్చింది గనుక ఆమెను మహిషాసురమర్థిని అన్నారు. హరిచందనాలు, మందారాలు, పారిజాతాలు, కదంబవనాలు, పుష్యరాగాలు, పద్మరాగాలు, గోమేధికాలు, వజ్రాలు వైఢూర్యాలు, ముక్తా రత్నాలు, మరకతాలు, విద్రూమాభా లు, మాణిక్యాలు అన్ని చుట్టూ ఉండి, వేయి స్తంభాలున్న ఆవరణలో చింతామణి అనే శ్రీ నగరంలో ఉండే పరమ లలిత కోమలి అయి న అమ్మవారు దుష్ట రాక్షసుడ్ని చంపడం కో సం ఉగ్రరూపం దాల్చారు. అయితే ఆమ్మ వా రు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల ఉగ్ర రూపా నికి ఆవిర్భించిన ఒక దివ్య తేజస్సునే అమ్మ వారిగా అవతరించారని కూడా కథనం, మహిషాసుర మర్థినిని సర్వ దేవతా స్వరూపంగా కొలుస్తారు. శివుడి త్రిశూలం, విష్ణువు చక్రం, విశ్వకర్మబ్రహ్మ పరశువు, ఇంద్రుడి వజ్రా యు ధం, వాయుదేవుడు ధనుర్భాణాలు ఇస్తారు.

శ్రీ దుర్గాదేవి
దుర్గుడు, దుర్గముడు అనే రాక్షసులను సంహరించింది కనక దుర్గాదేవి. దుర్గ అంటే పొందుటకు శక్యం కానిది. దుర్గార్తి శమని అంటే అఽధిగమించడానికి శక్యం కాని కష్టాలను తొలగించే తల్లి అని అర్థం. మనిషి కష్టాలను మరీ ముఖ్యంగా దారిద్య్రం, దుఃఖం, భయం తొలగించడంలో దుర్గాదేవిని మించిన దేవత లేదు. మనుషులను అన్నిటికంటే ఎక్కువగా ఇబ్బంది పెట్టేది భయం. ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని ఇచ్చేది దుర్గాదేవి. దుర్గతులను, దుఃఖాన్ని తొలగించి ఉన్నతమైన బుద్ధి కుశలతను ఇస్తుంది. సాధారణంగా తల్లి తన బిడ్డల్లో ఎవరు వెనకబడ్డారో గమనించి.. అతడిని కాపాడడానికి ప్రయత్నిస్తుంది. దుర్గాదేవి కూడా కష్టాల్లో ఉన్నవారిని కనికరిస్తుంది. మార్కండేయ పురాణంతో దుర్గాసప్తసతి స్తోత్రం ఉంది. ఇది సకల పాప హరణం, సకల అభీష్టసిద్ధికి దివ్య ఔషధం.
శ్రీ మహిషాసుర మర్థిని
నాకు ఎదురే లేదు అని గర్వంతో విర్రవీగినవాడు మహిషాసురుడనే రాక్షసుడు. అం దుకే దేవతల సంపదలను ఆక్రమించాడు. వారి రాజ్యాలను ఆక్రమించాడు. ఆ గర్వమే అతడు పతనమయ్యేలా చేసింది. ధన, అధికార గర్వంతో విర్రవీగేవారిని, లెక్కలేనితనం ప్రదర్శించే వారిని ‘దున్నపోతు’ అని అభివర్ణించడం ఇప్పటికీ మనం చూస్తుం టాం. ‘వాడు దున్నపోతు’ అని తిడుతుంటా రు. వాడిది దున్నపోతు చర్మం అని విమర్శిస్తారు. ఇక్కడ గర్వం లేదా అహంకారానికి ప్రతీక దున్నపోతు. గర్వంతో విర్రవీగిన మహిషాసురుడిని చంపింది కనక ఆమె మహిషాసురమర్థిని. మహిషాసురుడు వ రం కోరుకున్నప్పుడు సీ్త్రని ఒక అబలగా చూ శాడు. ఆమె తనకు పోటీ కాదనుకున్నాడు. అందుకే తనకు పురుషుడితో మరణం ఉం డరాదని కోరుకున్నాడు. ఆ తర్వాత అహంకారంతో అమ్మవారినే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. సీ్త్రని తక్కువగా చూస్తే ధనం నిలబడదు. ధనం అంటే ఇక్కడ అధికారం, రాజ్యం, సంపద అని కూడా. సీ్త్ర వాంఛతో ఏకంగా పతనమే సంభవిస్తుంది. గర్వం, అహంకారం, సీ్త్ర వాంఛ ఉండ కూడదని చెప్పడమే మహిషాసురమర్థిని అలంకారం ఉద్దేశం. ఇక్కడ సుదర్శన చక్రంతో తల ఖం డించింది. శూలంతో పొడిచింది. అందుకే ఆమెను కొందరు లక్ష్మిగా, మరికొందరు పా ర్వతిగా భావన చేశారు. ఎవరు ఎలా భావన చేసినా ఆమె సకల దేవతా స్వరూపిణి.

No comments:

Post a Comment