నేటి నుంచి జన్మభూమి-మన ఊరు
అయిదు అంశాలపై ప్రచారం
ప్రారంభానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
4 నుంచి గ్రామసభలు
రాష్ట్ర ప్రభుత్వం జన్మభూమికి పునరంకితం అవుతోంది. గురువారం నుంచి 20వ తేదీ వరకు జన్మభూమి- మన ఊరు కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకవసరమైన ఏర్పాట్లు పూర్తయ్యాయి. జన్మభూమిలో అయిదు అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. గ్రామ పంచాయతీల వారీగా మైక్రోప్లాన్ సిద్ధ్దం చేస్తారు. రాష్ట్ర రాజధానిగా నామకరణం జరిగిన విజయవాడలోని సింగ్‌నగర్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈనెల 4 నుంచి గ్రామసభలు నిర్వహిస్తారు. గురువారం నుంచి జిల్లాలో జన్మభూమి కోలాహలం మొదలు కానుంది. 2004 కు ముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు జన్మభూమి కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించారు. తిరిగి 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వంద రోజుల పాలన అనంతరం మళ్ళీ జన్మభూమికి శ్రీకారం చుట్టారు. ప్రతి గ్రామంలోను, మునిసిపాలిటీలోను ఈ సందర్భంగా జన్మభూమి గ్రామసభలు జరగనున్నాయి. గురువారం ప్రారంభోత్సవ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించి దసరా పండుగ అనంతరం 4వ తేదీ నుంచి సెలవు దినాలు కాకుండా మిగిలిన రోజులలో ఊరూరా గ్రామ సభలు జరగనున్నాయి. గ్రామ సభలు నిర్వహించే అధికారిక బృందాలకు ఎంపీడీవో కో ఆర్డినేటర్ గా వ్యవహరిస్తారు. మండలంలో గల పంచాయతీలను బట్టి బృందాలను ఎంపిక చేస్తారు. 20 వరకు జరగనున్న జన్మభూమి కార్యక్రమంలో 14 పనిదినాలు ఉన్నాయి. ఒక్కొక్క బృందం ఒక రోజంతా ఒకే ఊరిలో గ్రామసభ నిర్వహించాల్సి ఉంటుంది. అందుకనుగుణంగా పంచాయతీలను బట్టి మండలంలో ఒకటి లేదా రెండు బృందాలు పనిచేసే అవకాశం ఉంది. రెండో బృందానికి తహసీల్దార్ కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా అయిదు అంశాలపై ప్రచారం నిర్వహించారు. స్వచ్ఛాభారత్, బడి పిలుస్తోంది, పొలం పిలుస్తోంది, ఎన్టీఆర్ సుజల పథకం, ఎన్టీఆర్ భరోసా (పింఛన్లు) పథకాలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో ఒకటి, మునిసిపాలిటీలో రెండు చొప్పున సుజల పథకాలు ఏర్పాటు చేసి సురక్షిత మంచినీరు (మినరల్ వాటర్) ప్రజలకు చౌకగా అందించనున్నారు. అలాగే పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందిస్తారు. జిల్లాలో 3,12,185 మంది పింఛనుదార్లు ఉండగా ఇటీవల జరిగిన పరిశీలన అనంతరం 12,819 మందిని అనర్హులుగా తేల్చారు. మిగిలిన 2,99,366 మందికి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా పెరిగిన పింఛన్లు ఈనెల 4 నుంచి జరిగే గ్రామ సభలలో అంద నున్నాయి. వీటితో పాటు గ్రామసభలలో ప్రజలకు అవసరమైన సమిష్టి అవసరాలను బృందాలు గుర్తిస్తాయి. తాగునీరు, పారిశుధ్యం, రోడ్ల నిర్మాణం తదితర అంశాలకు సంబంధించి గ్రామ పంచాయతీల వారీగా మైక్రో ప్లాన్ సిద్ధ్దం చేస్తారు. నిధుల లభ్యతను బట్టి తక్షణ అవసరాలను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటారు. 2015-16 బడ్జెట్‌లో మైక్రోప్లాన్ అమలుకు నిధులు కేటాయిస్తారు. తద్వారా జన్మభూమితో అటు గ్రామాలు ఇటు పట్టణాలు ధన్యతను పొందనున్నాయి.

No comments:
Post a Comment